హర్షం వ్యక్తం చేసిన క్రైస్తవ సమాజం…
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా పాస్టర్స్ సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా జీవన్ ఇండియా, ఉపాధ్యక్షుడిగా దేవయ్య, ప్రధాన కార్యదర్శిగా రాజేష్ ఎన్నికయ్యారు. అలాగే సహాయ కార్యదర్శిగా సుంకే జోసఫ్, కోశాధికారిగా ప్రభుదాస్, ప్రోగ్రాం ఆర్గనైజర్లుగా దేవానంద్ మరియు ప్రేమ్ కుమార్, ఈసీ సభ్యులుగా అహారోన్, యెషయా బాబు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు జీవన్ ఇండియా మాట్లాడుతూ.. క్రైస్తవ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. సమాజ బలోపేతానికి, సంఘ ఐక్యతకు, సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ క్రైస్తవ సమాజాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు హాజరై నూతన కమిటీని అభినందించారు.
