బలగం టివి, ఎల్లారెడ్డిపేట
గత కొన్నాళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న ఓ వడ్రంగి శుక్రవారం రోజు తీవ్ర అస్వస్థకు గురై కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడి మోజు లక్ష్మీరాజాం (75) అనే విశ్వబ్రాహ్మణుడు వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొన్ని నాలుగ పక్షవాతంతో పాటు పలు అనారోగ్యాలకు గురయ్యాడు. పెద్ద కుమారుడు దేవేందర్ (మూడో వార్డు సభ్యుడు), చిన్న కుమారుడు సతీష్ ప్రముఖ బట్టల వ్యాపారి లు తండ్రికి మెరుగైన వైద్యం కోసం ఎన్నో ఆసుపత్రులు చూయించిన నయం కాకపోవడంతో తండ్రి లక్ష్మీనారాయణ మంచం పట్టాడు. శుక్రవారం రోజు తీవ్ర అస్వస్థకు గురై తుది శ్వాస విరిచారు.వీరి పెద్ద కుమారుడు దేవేందర్ స్థానిక వార్డ్ మెంబర్ అయినందుకు స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు పరామర్శించి ఓదార్చారు.