బలగం టివి, తంగళ్లపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీలో కిరాయి ఉంటున్న కామారెడ్డి జిల్లా అంబారీ పేట కి చెందిన గుండం రాజు 32 సంవత్సరాల వయస్సు అనునతడు 3 సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని ఇందిరమ్మ కాలనీ లో నివాసం ఉంటున్నడు.2 సంవత్సరాల క్రితం ఉపాధి కొరకు గల్ఫ్ వెళ్లి, అనారోగ్యం కారణంగా 7 నెలల క్రితం తిరిగి
వచ్చినప్పటి నుండి ఆరోగ్యం బాగా లేక పని లేకపోవడం వలన తీవ్ర మనస్తాపం తో, అనారోగ్యం తో జీవితం మీద విరక్తి చెంది తెల్లవారుజామున ఎవరు లేని సమయం లో ఇంట్లో ఫ్యాన్ కి చీర తో ఉరి వేసుకున్నట్లు మృతుని తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై సుధాకర్ తెలిపారు.