బలగం టీవి, ఎల్లారెడ్డిపేట :
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పెట్రోల్ పంప్ ఎదురుగా ఈనెల 10వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసుల, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం గుజరాత్ రాష్ట్రానికి చెందిన ప్రజాపతి కుల్దీప్ (26) అనే వ్యక్తి దేశాయ్ బీడీ కంపెనీలు టేకేదారుగా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో ఎల్లారెడ్డిపేట బీడీ కంపెనీ తనిఖీ చేసి గంభీరావుపేట గ్రామానికి చెందిన కిషన్ అనే వ్యక్తితో ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పంపు కు వెళ్తుండగా కామారెడ్డి నుంచి వస్తున్న అశోక లీల్యాండ్ అనే వాహనం అతివేగంతో అజాగ్రత్తగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు.ఈ సంఘటనలో కిషన్కు హెల్మెట్ ఉండడం వల్ల స్వల్ప గాయాలు కాగావెనకాల ఉన్న కుల్దీప్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే 108 లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా శనివారం మధ్యాహ్నం మృతి చెందిందని వారు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఎక్కడో రాష్ట్రంలో పుట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుల్దీప్ వార్తను విన్న బీడీ కంపెనీ యజమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.