బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రానికి చెందిన పుల్లరి ఆంజనేయులు (47) ఉపాధి నిమిత్తం రోజు సిరిసిల్లలో సాంచెలు నడపడానికి వెళ్లి వచ్చేవాడు. పనిచేసుకుంటూ సిరిసిల్లలో గుల్ ఫారం కల్లుకి అలవాటు పడి, రోజు పని అయిపోయిన తర్వాత తాగి ఇంటికి వచ్చేవాడు. యధావిధిగా పని ముగించుకొని ఈనెల 11వ తేదిన కల్లు తాగేసి ఇంటికి అందాద 7:30 గంటలకు వచ్చాడు.బట్టలు చేంజ్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్లినాడని ఇంట్లో వాళ్ళు అనుకున్నారు, తిరిగి రాకపోయేసరికి ఆరోజు రాత్రి మరుసటి రోజు చుట్టు ప్రక్కల గ్రామాలలో వెతికారు. ఏక్కడ ఆచూకీ దొరకలేదు.శనివారం ఉదయం దాదాపు 9 గంటల సమయంలో ఇంటిలో సాద బావిలో దుర్వాసన రావడంతో అందులోకి చూసేసరికి బావిలో శవమై తేలాడు. మృతునికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.
సీఐ వెంట హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, సిబ్బంది మురళీమోహన్, రామస్వామి, గంగారం ఉన్నారు.