బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
పలు ఆలయాల్లో చోరీలో నిందితుడుగా ఆంజనేయులు
ముస్తాబాద్ మండలంలోని పలు ఆలయాల్లో దొంగతనాలు చేస్తూ వాటిని అమ్ముకొని జల్సాలకూ అలవాటు పడ్డ వ్యక్తిని బుధవారం రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని ఎస్సై గణేష్ తెలిపారు. వారి వివరాల ప్రకారం మండలంలోని తెర్లమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు @ అంజి అనే వ్యక్తి ఇటీవల మొర్రాయిపల్లి, గూడూరు గ్రామాలలో ఉన్న ఆలయ తాళాలు పగలగొట్టి నగదు తోపాటు పలు వస్తువులను దొంగతనం చేసి అమ్ముకొని జలసాల కలవాటు పడ్డాడు. బుధవారం మండల శివారులోని ఓ గార్డెన్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించగా నేరం రుజువైనందున అతడిని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.