బలగం టీవీ, హైదరాబాద్ :
- బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్లకు తలొగ్గిన ప్రభుత్వం
- రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులకు ఎమ్మెల్సీ కవిత డిమాండ్
- తన రాజకీయ చతురతతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- చివరికి రాజకీయ, విద్యా – ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లకు వేర్వేరు బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర
బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో విజయం సాధించారు. తన రాజకీయ చతరతతో, వ్యూహాత్మక అడుగులతో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ప్రభుత్వం వేర్వేరు బిల్లుల తీసుకొచ్చేలా ఒత్తిడి తెచ్చారు. బీసీలకు జానాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏడాదిగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ భాగంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని అమలు చేయాలన్న డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రతంగా పర్యటన చేపట్టి వివిధ రూపాల్లో ఉద్యమాలు చేపట్టారు.
అయితే, స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉపాధి రంగాల్లోనూ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడమే కాకుండా అందుకు వేర్వేరు బిల్లులను ఆమోదించాలని ఎమ్మెల్సీ కవిత తొలి నుంచీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మూడు రంగాలకు కలిపి ఒకే బిల్లు పెడితే న్యాయపరమైన చిక్కులు వచ్చి మొదటికే మోసం వస్తుందని తొలి నుంచీ ఎమ్మెల్సీ కవిత వాదిస్తూ వస్తున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో ఉంటాయని, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కేంద్ర – రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం అవసరమని, ఈ రీత్యా రాజకీయ రిజర్వేషన్లను కూడా విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో కలిపి చేస్తే ఏ రిజర్వేషన్లూ పెరగక బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత బలంగా తన వాదనను వినిపిస్తూ బీసీ వర్గాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఫలితంగా వేర్వేరు బిల్లులను తీసుకురాక ప్రభుత్వానికి తప్పలేదు.
తెలంగాణ శాసన సభా ఆవరణలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీలకు జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ఏడాది కాలంగా ఉద్యమిస్తున్నారు. తెలంగాణ జాగృతి, ఫూలే యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలను సంఘటిత పరిచారు. రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలతో సమావేశమై రిజర్వేషన్ల పెంపునకు తాను చేస్తున్న ఉద్యమంలో కలిసి రావాలని కోరారు. ఈక్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా రిజర్వేషన్ల పెంపు ఉద్యమాన్ని కవిత చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చినట్టుగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని ప్రయత్నించగా ఆ కుట్రలను కవిత తిప్పికొట్టారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, ఉద్యోగాల్లో 46 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వేర్వేరు బిల్లులు పెట్టాలని ఇందిరాపార్క్ వేదికగా నిర్వహించిన మహాధర్నాలో డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 4న కుల గణనపై నిర్వహించిన శాసన మండలి కౌన్సిల్ సమావేశం సందర్భంగానూ కవిత ఇదే వాదన వినిపించారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కల్పన నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి సర్కారుపై తన ఉద్యమాల ద్వారా ఒత్తిడి పెంచారు. ఫలితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కవిత డిమాండ్ చేసినట్టుగా వేర్వేరు బిల్లులు రూపొందించింది.
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాల క్రమం
- 21 జనవరి 2024 – అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబా ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు వినతి పత్రం
- 26 జనవరి 2024 – హైదరాబాద్ లో బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం
- 05 ఫిబ్రవరి 2024 – యునైటెడ్ ఫులే ఫ్రంట్ ఆవిర్భావం
- 06 ఫిబ్రవరి 2024 – తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం
- 06 ఫిబ్రవరి 2024 – తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో వరంగల్ లో రౌండ్ టేబుల్ సమావేశం
- 07 ఫిబ్రవరి 2024 – వికారాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం
- 11 ఫిబ్రవరి 2024 – యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం
- 11 మార్చి 2024 – నల్గొండలో రౌండ్ టేబుల్ సమావేశం
- 11 ఏప్రిల్ 2024 – సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో యునైటెడ్ ఫులే ఫ్రంట్ కో కన్వీనర్ బొల్లా శివశంకర్ నాయకత్వంలో కులగణన, బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం సమావేశం
- 25 నవంబర్ 2024 – తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ బీసీ కమిషన్ కు సమగ్ర నివేదిక
- 02 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో పద్మశాలి కుల సంఘం నేతలతో సమావేశం
- 06 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో జోగి సంఘం కుల నేతలతో సమావేశం
- 07 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో మ్యాదరి కుల సంఘం నేతలతో సమావేశం
- 11 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో వడ్డెర కుల సంఘం నేతలతో సమావేశం
- 12 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో వంశరాజ్, సగర ఉప్పర, రజక కుల సంఘాల నాయకులతో సమావేశం
- 12 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో బీసీ కుల సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం
- 24 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో ముదిరాజ్ సంఘం, విశ్వకర్మ సంఘాల నాయకులతో సమావేశం
- 26 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో శాలివాహన కుమ్మర సంఘం, ఆరె కటిక కుల సంఘాల నాయకులతోసమావేశం
- 26 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో బీసీ కుల సంఘాలతో ఉద్యమ కార్యాచణపై సమావేశం
- 27 డిసెంబర్ 2024 – హైదరాబాద్ లో ఉమ్మడి నిజామాబాద్ బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో పూసల, ముదిరాజ్, పద్మశాలి, మొండి బండ, రజక, నాయీ బ్రాహ్మణ, కురమ, యాదవ, గౌడ్, దాసరి, జంగమ, నకాశి, రెడ్డిక, వీర శైవ, మున్నూరుకాపు, పెరిక, మేరు సంఘ నాయకులుతో ప్రత్యేక సమావేశం
- 03 జనవరి 2025 – స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా
- 23 జనవరి 2025 – కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత లేఖ
- 15 ఫిబ్రవరి 2025 – తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖమ్మంలో రౌండ్ టేబుల్ సమావేశం
- 28 ఫిబ్రవరి 2025 – తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ లో రౌండ్ టేబుల్ సమావేశం
బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాల క్రమాల గురించి తెలియజేశారు.