బలగం టీవి ,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చిన ప్రముఖ వ్యాపారవేత్త ఘనగోని ధర్మ గౌడ్ వారికి కొంత ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచాడు.గ్రామస్తుల వివరాల ప్రకారం సింగారం గ్రామానికి చెందిన దోర్నాల బాలరాజు భార్య ముత్తవ్వ (50) బ్రెయిన్ కు సంబంధించిన వ్యాధితో చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందింది.అలాగే ద్యాగల లక్ష్మి నారాయణ (54) అనే వ్యక్తి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందగా ఇరువురి కుటుంబాలను అదే గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వారి తండ్రిగారి కీర్తిశేషులు ఘనగోని బంగ్లా వెంకటయ్య జ్ఞాపకార్థం వీరి ఇరువురి కుటుంబాలను శనివారం రోజు పరామర్శించి ఓదార్చి ఒక్కొక్కరికి 1500 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం నువ్వు అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా గ్రామం లో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇరువురి మృతి పట్ల తీవ్ర బాధాకరమని గ్రామంలో ప్రతి ఒక్కరితో వీరు కలివిడిగా ఉంటూ ఇలా అనారోగ్యమైన బారినపడి మృతి చెందిన పట్ల బాధాకరమైన విషయమని ఆయన అన్నారు. నాతోపాటు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వారి కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బెస్త పాక రాములు, ముత్యాల బాలరాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఎలాంటి ఆపద కైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయంతో పాటు నిత్యవసర సరుకులు అందిస్తున్నందున ధర్మ గౌడ్ అనే వ్యాపారవేత్తను గ్రామస్తులు అభినందించారు.
