చిన్నతనం నుండే పరిశోధన మనస్తత్వం అలవర్చాలి..

0
57
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

బలగం టీవీ, వేములవాడ:

విద్యార్థులు చిన్నతనం నుంచే పరిశోధనా మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్, వాణి విద్యాలయంలో సైన్స్ ఫెయిర్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శనలను ఆయన సందర్శించి విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ నమూనాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులు, ఆధునిక సాంకేతికత మోడళ్లను ఆసక్తిగా పరిశీలించారు. ప్రతి స్టాల్ వద్ద ఆగి విద్యార్థులతో మాట్లాడి వారి ఆలోచనా విధానాన్ని తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. భవిష్యత్తులో దేశ అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగం కీలకమని, చిన్ననాటి నుంచే పరిశోధనా మనస్తత్వం అలవర్చుకోవాలని సూచించారు.

శాస్త్రీయ దృక్పథం ప్రతి విద్యార్థి జీవితంలో భాగమవ్వాలని, ప్రశ్నించే స్వభావం పెంపొందించుకోవాలని సూచించారు. సైన్స్ అనేది పుస్తకాలకే పరిమితం కాకుండా, దైనందిన జీవితంలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనే సాధనమని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విద్యార్థులకు డైట్ చార్జీలో కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను వారి వద్ద ఉంచుకొని విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరిపడా టీచర్ల నియామకాన్ని ముఖ్యమంత్రి డీఎస్సీ ద్వారా నియమించారని, 200 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు..

విద్య కమిషన్ చైర్మన్ మూడు రోజుల క్రితం దేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించి విద్యా విధానంలో మార్పులకు పలువురు సూచనలు తీసుకొని ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here