బలగం టీవీ, జగిత్యాల:
జగిత్యాల జిల్లా ఆత్మకూర్ గ్రామానికి చెందిన సుందరగి శంకర్ గౌడ్ ఖతార్ దేశంలో ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పనిచేసే ఐసీబీఫ్ అనే సంస్థా కు ఇండియన్ ఎంబసీ వారి రాష్ట్రల వారిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపికలో గత కార్యవర్గంలో పని చేసిన సుందరగిరి శంకర్ గౌడ్ ను మరో సారి గుర్తించి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి ఎంపిక చేశారు. ఈ కార్యవర్గం వచ్చే రెండు సంవత్సరాలు పని చేస్తుంది. తెలంగాణ గల్ఫ్ సమితి కార్మిక సంఘం లో కీలక పాత్ర పోసిస్తూ ఖతార్ లో కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి కార్మికుల సమస్యల పరిస్కారం కొరకు పాటుపడుతున్న వ్యక్తి ని ఎంపిక చేయడంతో కార్మికులందరు ICBF కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.