సిరిసిల్ల న్యూస్:
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉంటు నిరంతరం వైద్య సేవలు నిర్వహించిన 104 సంచార వాహనం నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజుల పైసా రాళ్లపాలు అన్న విధంగా మూలన పడింది. మూలన పడిన వాహనాలను ఆర్టీవో అధికారులకు అప్పజెప్పాలని లేదా వేలం వేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ పట్టించుకునే అధికారులు లేక ఓ మూలన చెట్ల తీగలకు ఆసరాగా నిలిచింది. వైయస్సార్ ప్రభుత్వం తీసుకువచ్చిన 104 ,108 అంబులెన్స్ సేవలు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ఇంటి వద్దకు వచ్చి రక్త పరీక్షలు నిర్వహిస్తూ, వ్యాధుల మీద అవగాహన కల్పిస్తూ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు అందించేవారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కొరకు జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.మూలకు పడిన 104 వాహనంపై ముద్ర వివరణ కోరగా మెడికల్ ఆఫీసర్ స్నేహ 104 సేవలు నిలిచాయని అందులో పని చేసే సిబ్బంది సర్దుబాటు చేశారని మండలంలోని సబ్ సెంటర్లు నిర్వహించి వైద్య సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. అత్యవసరమైన సమయంలో ప్రజలకు అందుబాటులో అంబులెన్స్ సేవలకై 8712632385,108 ఈ నంబర్ కి కాల్ చేయాలని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉండే మెరుగైన వైద్యం కోసం104 సేవలు కొనసాగించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
