బలగం టివి ,
జన విజ్ఞాన వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులు జనగామ జిల్లాలో జరుగుతున్న “రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల” కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా జన వేదిక వేదిక తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మోహన్ రావు మాట్లాడుతూ… మన నిత్య జీవితం సైన్స్ తోనే ముడిపడి ఉన్నది. కావున ప్రతి ఒక్కరు బాల్య దశ నుంచి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి. తద్వారా మూఢనమ్మకాలు నిర్మూలించవచ్చు. పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఉపాధ్యాయులు మూలం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచి వైజ్ఞానిక అభిరుచిని పెంపొందించడానికి రాష్ట్రవ్యాప్తంగా చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన ముస్తాబాద్ మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ బంధన కల్ పాఠశాల మరియు ఎల్లారెడ్డిపేట మండలంలోని విజ్ఞాన్ ఉన్నత పాఠశాల విద్యార్థులను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచీ జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు సి.రామరాజు , జిల్లా అధ్యక్షులు గుర్రం అంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు ప్యారం లక్ష్మీనారాయణ,జిల్లా కమిటీ సభ్యులు తౌతు మధు, జే.వి.వే రాష్ట్ర కమిటీ బాధ్యులు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు మరియు వివిధ జిల్లాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
