భయాందోళనలో గ్రామాల్లో ప్రజలు
బలగం టివి,తంగళ్ళపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని బాబాజీ నగర్ మరియు పద్మనగర్ లోని ఇళ్లలో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో చొరబడి దొంగలు డబ్బు నగలు ఎత్తుకెళ్లారు. స్థానికుల వివరాల ప్రకారం అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో బాబాజీ నగర్ లోని మేకల గంగారం, మేకల నరసయ్య,కడమంచిలింగమూర్తి, పద్మా నగర్ గ్రామంలోని పారానంది ఆంజనేయులు శర్మ ఇళ్లలో తాళాలు పగలగొట్టి డబ్బు నగలు దోచుకెళ్లారు. రెండు రోజుల క్రితం మండలంలోని ఓబులాపూర్ గ్రామంలోని రెండు ఇళ్లలో ఇలా మండలంలోని వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు.