వేములవాడ రాజన్న ఆలయ అధికారికి ఘన వీడ్కోలు

0
43

బలగం టీవీ, వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మన్నగారి శ్రీనివాస్ శనివారం పదవీ విరమణ పొందిన సందర్భంగా వేములవాడలోని భీమేశ్వర సదన్లో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించగా,సమావేశానికి అధ్యక్షులుగా కూరగాయల శ్రీనివాస్ వ్యవహరించారు. ఆలయం తరఫున శ్రీనివాస్ గారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం మరియు స్వామివారి చిత్రపటము అందజేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆలయ ఉద్యోగులు శాలువాతో సత్కరించినారు.

అలాగే, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తూ, యాదగిరిగుట్టలో పర్యవేక్షకులుగా సేవలందించిన కాంచనపల్లి నటరాజు కూడా పదవీ విరమణ పొందిన సందర్బంగా వారి సేవలను కొనియాడారు. ఇక్కడ టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్, మినిస్టీరియల్ మరియు నాలుగవ తరగతి సిబ్బంది యూనియన్ సభ్యులు, ఆలయ ఉద్యోగులు, వేద పండితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here