బలగం టివి, రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓగా పనిచేసిన మామిండ్ల దశరథంకు తెలంగాణ సాంస్కృతిక సారథి అధ్యక్షులు ఎడమల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు పలికారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డి పి ఆర్ ఓ శ్రీధర్ కు పూల బొకే అందించి స్వాగతం పలుకుతూ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలను చైతన్య పరిచేలా సాంస్కృత సారధులు పని చేయాలని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షుడు ఎడమల శ్రీధర్ రెడ్డి,ఉపాధ్యక్షుడు శ్రీరాముల రామచంద్రమ్,గడ్డం దేవయ్య,గడ్డం శ్రీనివాస్, వంతడుపుల గణేష్,పుడూరి సంజీవ్,గుగ్గిళ్ల పర్శరములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
