బలగం టివి, తంగళ్ళపల్లి
స్టేట్ కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసేబులిటీస్, సీనియర్ సిటిజన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ డిపార్ట్మెంట్ బి. శైలజ ఆదివారం రోజున తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని వయోవృద్ధుల ఆశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా వారు వయోవృద్ధుల ఆశ్రమంలో ఉంటున్న నివాసితులతో ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వారికి అందిస్తున్న వసతులు సౌకర్యాల గురించి జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మి రాజం ను ఆరా తీశారు. ఆశ్రమంలోని అన్ని గదులను వసతులను పరిశీలించారు. అలాగే సదనంలో పెంచుతున్న కిచెన్ గార్డెన్ మొక్కలను చూసి అభినందించారు.వారికి అందిస్తున్న సేవలు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వయవృద్ధులు కోరినట్లు మరింత మెరుగైన సేవలు అందించాలని ప్రతిరోజు భోజనంలో కోడిగుడ్డు, అరటిపండు తప్పనిసరిగా అందించాలని ఆదేశించారు. అలాగే వారికి ఉన్నటువంటి ఆస్తి సంబంధించిన వివాదాలు ఏమైనా కుటుంబానికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉంటే సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులతో మాట్లాడి వాటిని వెంటనే పరిష్కరించడానికి తగ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం మరియు హోం సిబ్బంది పాల్గొన్నారు.