బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం.టీబి ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బోయినిపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం అనంతపల్లి గ్రామాన్ని సందర్శించి, టీబికి సంబంధించిన రికార్డ్స్, రిపోర్ట్స్ ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడ టీబీ వ్యాధిగ్రస్తులు లేకపోవడం, పరీక్షలకు పంపించిన తెమడ శాంపుల్స్ అన్ని నెగటివ్ రావడం జరిగిందని తెలిపారు. అసంక్రమిత వ్యాధుల నివారణ పురోగతిని పరిశీలించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా టీ.బి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ అనిత, ఎన్.సి.డి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, బోయినిపల్లి వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, జిల్లా టీబీ కోఆర్డినేటర్ బిగేందర్, సూపర్ వైజర్ శశి కుమార్, కార్యదర్శి అనిల్, ఎస్.టి.ఎస్ గంగాధర్, ఏఎన్ఎం సరిత, ఆశ వర్కర్ లత, తదితరులు పాల్గొన్నారు.