బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్
పహల్గాంలో పర్యాటకులను ఉగ్రవాదులు అమానుషంగా చంపడాన్ని సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించారు. మృతులకి నివాళులర్పించారు. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈరోజు సిపిఎం ఆద్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద పహల్గామ్ ఉగ్రదాడులను ప్రాణాలు కోల్పోయిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి. ము శం మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్లిన సందర్శకులని ఉగ్రవాదులు కాల్చి చంపడం హేయమైన చర్య అని అన్నారు. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చర్యలను ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. మిల్ట్రీ దుస్తుల్లో ఉగ్రవాదులు వచ్చారని కథనాలు వెలువడుతున్నాయని, ఉగ్రవాదుల దాడిని ఆసరాగా చేసుకొని దేశంలో మత విద్వేషాలను సృష్టించే శక్తులు తప్పుడు ప్రచారాలు విస్తృతంగా చేస్తున్నాయి. ఉగ్రదాడులను దేశంలోని ముస్లింలను దోషులుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరైనది కాదు. గత పది సంవత్సరాలుగా బిజెపి ఉగ్రవాదాన్ని నిర్మూలించామని చెప్పుకుంటున్న గొప్పల డొల్లతనం బయటపడిందని విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడులలో ప్రభుత్వ భద్రతా వైఫల్యాలలకు కేంద్రం బాధ్యత వహించాలని అన్నారు. మొత్తం ఘటనపై సమగ్రమైన విచారణ చేయడం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలని అన్నారు. దేశంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో మత విద్వేషం రెచ్చగొడుతున్న మతోన్మాదుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలంతా ఐక్యంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కోడం రమణ, జిల్లా కమిటీ సూరం పద్మ, సిపిఎం నాయకులు మిట్టపల్లి రాజమల్లు, సిరిమల సత్యం, నక్క దేవదాస్, కుమ్మరి కుంట కిషన్, బేజిగం సురేష్, ఎలిగేటి శ్రీను, బాస శ్రీధర్, రామచంద్రం, ఉడుత రవి, వడ్డేపల్లి గోవర్ధన్, సందుపట్ల పోచమల్లు, బింగి సంపత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
