- రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
బలగం టీవీ, వేములవాడ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. వేములవాడ పట్టణ బిజెపి అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు.
ఆలయ అభివృద్ధి ఏమేరకు జరిగిందో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. రొటేషన్ పద్ధతి ద్వారా శాస్త్రీయంగా వార్డులను అదేవిధంగా రిజర్వేషన్లను ఎలాంటి ఒత్తిడి లేకుండా శాస్త్రీయంగా చేయాలన్నారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ సీఎస్‍ఆర్ రూ.2 కోట్ల నిధులతో ఏరియా ఆసుపత్రికి పరికలను అందజేశారన్నారు. మున్సిపల్ కు వచ్చే నిధులు 14,15 ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయని చెప్పారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నీటి పంపిణీ కోసం అమృత్ పథకం కింద కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి 13 కోట్ల నిధులను అందించారన్నారు. విద్య వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామన్నారు. రాజన్న గుడి ప్రధాన రహదారి కూల్చి ఎన్ని రోజులు అవుతుంది దానిని రీ డెవలప్మెంట్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారో మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆలయ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.
గత పది సంవత్సరాలల్లో మున్సిపల్ అభివృద్ధిని ఏదైతే అవినీతిమయం చేసిన టిఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా వారు చేసిన పనులను అదే రకంగా కొనసాగిస్తూ చాలా అభివృద్ధికి నోచుకోకుండా మున్సిపాలిటీలను చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు వేములవాడని చూసినట్లయితే గుడి ప్రధాన రహదారి మరి అది కూల్చే ఎన్ని రోజులు అవుతుంది మల్ల దాన్ని రీడ్ డెవలప్మెంట్ చేయడానికి ఎంత సమయం తీసుకుంటారని కూడా మీ ద్వారా మాకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు వేములవాడ ప్రాంతానికి సంబంధించిన రాజరాజేశ్వర స్వామి దర్శనాన్ని ప్రజలను ప్రజలకు దూరం చేసుడు తప్ప అధికార కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఏ రోజైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని బంద్ చేసిండో అప్పటి నుండి ఇప్పటివరకు ఆ దేవాలయంలో ఏమి అభివృద్ధి జరిగిందన్నది మీ ద్వారా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఎమ్మెల్యే ని కోరుతున్నాను అని అన్నారు. ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధిని విడిచిపెట్టి అసెంబ్లీలో మాట్లాడి గుడి చెరువులో బోట్లకు పైసలు తీసుకొస్తున్న అని చెప్తున్నారు ప్రజలకు రాజన్నను దూరం చేసినావు కదా మరి సమ్మక్క సారక్క కన్నా రాజన్న దర్శనం కల్పిస్తావా లేదా అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. వారు చేసిన పని పాపం ఉట్టిగానే పోదు కచ్చితంగా వారు అనుభవిస్తారు. ఎవరైతే రాజన్న ప్రజలకు దూరం చేసే ప్రక్రియ చేసింది వాళ్ళు దానికి అంతగంతకు అనుభవిస్తూనే ఉంటారని, మేము సమ్మక్క సారక్కకు రాజన్న దర్శనం కల్పిస్తామని చెప్పి మీరైతే పని స్టార్ట్ చేశారో అది ఎంత దూరం వచ్చిందో తప్పకుండా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వేములవాడ ప్రజల పట్టణ ప్రజల యొక్క పరిస్థితి దీనంగా మారిందని, రోడ్లమీద దుమ్ము వ్యాపారాల్లో నష్టం ఈ శాసనసభ్యులు ప్రధాన పాత్ర కనుక వీటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని వేములవాడ ప్రాంత ప్రజలందరూ మాకు ఈసారి అవకాశం ఇవ్వండి మీకు అభివృద్ధి అంటే ఏందో చేసిపెడతామనీ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ గంగాడి మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ చెన్నమనేని వికాస్ రావు, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు చంటి మహేష్, మాజీ కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
