బలగం టీవి, ముస్తాబాద్ :
ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో అప్పుల బాధతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అవునూర్ గ్రామానికి చెందిన బత్తుల రాజు మృతి చెందడం చాలా బాధాకరమని అతనికి భార్య సింధూర ఇద్దరు చిన్న పిల్లలు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారని విచారం వ్యక్తం చేశారు.మృతునికి ఐదు లక్షల వరకు అప్పుల అయ్యాయని రోజు రోజుకు అప్పుల సమస్య ఎక్కువ కావడంతో వాటిని తీర్చే ప్రయత్నంలో విఫలం కావడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు.రాజు స్నేహితులు గమనించి ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు.