బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
కేసీఆర్ నగర్ లో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం సాయంత్రం సమయంలో 6:30 గంటల సమయంలో కెసిఆర్ నగర్ కాలనీకి చెందిన గరిక ప్రవీణ్ అనే 25 సంవత్సరాల యువకుడు గత కొంతకాలంగా పెయింటర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతనికి చేతినిండా పని దొరకకపోవడంతో సిరిసిల్లలోని ఓ కిరణ షాపులో పని కుదుర్చుకున్నాడు. గత కొద్ది రోజుల నుండి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో మృతుని తల్లి చూసేసరికి బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. మృతునికి భార్య గాయత్రి, కుమారుడు గౌతమ్, కూతురు నికిత ఉన్నారు.మృతికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.