బలగం టీవి ..,తంగళ్ళపల్లి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా మండలంలోని మండేపల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గణప శివ జ్యోతి మాట్లాడుతూ దరఖాస్తులు స్వీకరించే క్రమంలో లబ్ధిదారులు అర్హులైన పథకాలకు ఒకే ఫారం పైన నింపి అందజేయాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అమలయ్యేలా చేస్తామన్నారు.ఈరోజు గ్రామంలో ఎవరైనా దరఖాస్తు చేయలెనివారు జనవరి 6వ తేదీ వరకు గ్రామంలోని కార్యదర్శి కి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పుర్మాని మంజుల, ఎంపీటీసీ బుస్సా స్వప్న, కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్,పుర్మని లింగారెడ్డి,ఆసాని మహిపాల్ రెడ్డి, నక్క నరేష్, యాస సన్నీ, యాస మధు, తంగళ్ళపల్లి రాజు, కాంగ్రెస్ నాయకులు హారిక రెడ్డి,గడ్డం మధుకర్ చోటు, గుగ్గిల భరత్, గుగ్గిళ్ళ శ్రీకాంత్, పరశురాములు,ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
