బెస్ట్ అవైలేబుల్ స్కూల్స్ ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ.

0
40
  • రాజన్న సిరిసిల్ల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి డా.వి. రవీందర్ రెడ్డి

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

2026 – 2027 విద్యా సంవత్సరమునకు గాను బెస్ట్ అవైలేబుల్ స్కూల్ (రెసిడెన్షియల్ & నాస్ రెసిడెన్షియల్) పథకములో భాగంగా, ఉత్తమ పాఠశాలలను ఎంపిక చేయడానికి, రాజన్న సిరసిల్ల జిల్లాలోని ప్రవేటు ఇ /మీ పాఠశాలల నుండి దరఖాస్తుల ఆహ్వానించడం జరుగుచున్నది. ఇందుకుగాను బెస్ట్ అవైలేబుల్ స్కూల్ (రెసిడెన్షియల్) పథకములోని విద్యార్ధులకు ట్యుషన్, హాస్టల్ వసతి, భోజన వసతికి గాను సంవత్సరం నకు గాను ప్రతి విద్యార్థికి రూ.42,000/- చొప్పున మరియు బెస్ట్ అవైలేబుల్ స్కూల్ (నాస్ -రెసిడెన్షియల్) పథకములోని విద్యార్ధులకు ట్యూషన్ ఫీజుగా ప్రతి విద్యార్థికి రూ.28,000/- చొప్పున చెల్లించబడును. ఇందుకుగాను 7వ తరగతిలో మరియు 10వ తరగతిలో 90 శాతం ఉత్తీర్ణత అందులో 50 శాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని తెలిపారు. దరఖాస్తుల ఫారములను పొందుట కొరకు ‘సమీకృత జిల్లా సముదాయాల కార్యాలయము రాజన్న సిరిసిల్ల లోని మొదటి అంతస్తు రూమ్‍ నం. ఎఫ్‍-26 జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ రాజన్న సిరిసిల్ల కార్యాలయములో సంప్రదించగలరు. తదుపరి పూర్తి చేసిన దరఖాస్తులు తేది.25-03-2026, సాయంత్రం 5.00 గం. లోపు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ రాజన్న సిరిసిల్ల కార్యాలయములో సమర్పించవలయును. ఇట్టి అవకాశమును రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రవైటు ఇ/మీ పాఠశాలలు సద్వినియోగము చేసుకోగలరని తెలియజేయనైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here