బలగం టీవీ ,బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం ముందర ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఈతవనం,తాటివనం దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈత వనం, తాటి వనంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటిన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అంటుకున్న మంటలను చల్లార్చడం జరిగింది.
ఈ సందర్భంగా గౌడన్నలు మాట్లాడుతూ: ప్రమాదవశాత్తు దగ్ధమైన ఈతవనం, తాటివనం చెట్లు చాలావరకు కాలిపోవడం జరిగిందని, ఆప్కారి అధికారులు స్పందించి, మాకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నాం.
