సిరిసిల్ల 08, జనవరి 2024
ముంపు గ్రామాలలోనీ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
ముంపు ప్రాంతాలలో ప్రజల జీవనోపాధికి కుటీర , ఇతర పరిశ్రమల ను ఏర్పాటు కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయాలనీ ప్రభుత్వ విప్ అధికారులకు సూచించారు. ముంపు గ్రామాలలో ప్రజల. జీవనోపాధి నిమిత్తం పశు హాస్టల్ ల ను నిర్మించాలని చెప్పారు.
సోమవారం రాజన్న సిరిసిల్ల అభివృద్ధి పై సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా అధికారులతో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ శాఖల ద్వారా చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, వాటి ప్రగతి , పెండింగ్ అంశాలు తదితర అంశాలను ప్రభుత్వ విప్ కు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..,
కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలతో కొత్త ప్రభుత్వం కొలువుతీరిందన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తమ ప్రభుత్వం ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చిందన్నారు.
ఇచ్చిన హామీ మేరకు అరు గ్యారంటీ ల అమలుకు మున్సిపల్ వార్డులు,పల్లెల్లో ప్రజా పాలన కు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 8 కోట్ల మంది మహిళలు 0 టికెట్ తో ఉచిత ప్రయాణం చేశారనీ విప్ చెప్పారు.
అరు గ్యారంటీ ల ను 100 రోజుల్లో అమలు చేస్తామని సిఎం ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారనీ.చెప్పారు.
జిల్లాలో ప్రజా పాలన కార్యక్రమం ను చక్కగా నిర్వహించారనీ చెప్పిన…. విప్ కలెక్టర్, dpo, మున్సిపల్ కమిషనర్ లకు నా ధన్యవాదాలు తెలిపారు.
ప్రజా ప్రతినిదులు, ప్రభుత్వ అధికారుల సహకారం ప్రజా భాగస్వామ్యంతో జిల్లా అభివృద్ధినీ మరింత ముందు కు తీసుకుకెళతామనిచెప్పారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
-రైతులు నష్టపోకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలన్నారు
తాలుతో రైతులు దిగుబడి తో పాటు విక్రయించిన సమయంలో కోత లలో ఆర్థికంగా నష్టోతున్నారనీ… పంట విత్తే సమయంలోనే
నాణ్యమైన వరి వంగడాల ను రైతులకు అందుబాటులో ఉంచాలనన్నారు.
ఫలితంగా తప్ప తాలు సమస్యలు లేకుండా ఉంటాయి. రైతులకు నష్టం వాటిల్లదన్నారు.ప్రతీ గ్రామంలో వరి ధాన్యం నిల్వలకు ఒక గోదాం ప్రతిపాదన తేవాలన్నారు.
ఎంతో ఖర్చును వెచ్చించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి నీ సరఫరా చేస్తున్న దానిని ప్రజలు త్రాగెందుకు ఇష్టపడడం లేదన్నారు. గ్రామాల్లో కళజాత లు, విడియో డాక్యుమెంటరీ ల సహాయంతో క్షేత్ర స్థాయిలో మిషన్ భగీరథ నీటి పై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని చెప్పారు.
జిల్లాలో మత్య మహిళా సహకార సొసైటీ లు చాలా తక్కువ ఉన్నాయని ఫలితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను మహిళలు పొందలేకపోతున్నారని తెలిపారు. వచ్చే సంక్రాంతి నుండి ఓ యజ్ఞం లా
జిల్లాలో ముదిరాజులు, గంగపుత్రులలోని మహిళలను భాగస్వామ్యం చేసి ప్రతి గ్రామం నుండి ఒక మత్య సహకార మహిళా సొసైటీ ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వ సూచించారు.
జిల్లాలోని రుద్రంగి, వీర్నపల్లి, బండలింగంపల్లి లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి వీలుగా స్థలాలను గుర్తించాలన్నారు.
శ్వాస కోశ సమస్యలు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా
జిల్లాలో నీ drdo,అటవీ నర్సరీల్లో కోనో కార్పస్ మొక్కలను పెంచవద్దనీ చెప్పారు. ఇప్పటికే నాటిన మొక్కల స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటే విషయంను పరిశీలించాలని ప్రభుత్వ అధికారులకు సూచించారు. ప్యాకేజీ – 9 పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందించేలా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించారు.
మోత్కు రావు పేట – చందుర్తి రోడ్డు కు అటవీ అనుమతులు , సహా అన్ని ప్రతిబంధకాలు తొలగినందున వెంటనే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ప్రభుత్వ సంబంధిత ఇంజనీర్లు ఆదేశించారు. మూల వాగు పై నిర్మిస్తున్న వేములవాడ -తిప్పాపూర్ వంతెనను వేగంగా పూర్తి చేయాలన్నారు.
వీర్నపల్లి మండలం లో పొడు భూములకు పట్టా ఇచ్చిన కానీ బోర్లు వేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారని దాని పైన సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు..
సనుగుల వట్టిమల్ల రోడ్డులో లాచ్చాం పేట తండాలో వర్షాకాలంలో రాకపోకలకు జీవనం ఏర్పడుతుందని వాగు పై బ్రిడ్జి నిర్మాణానికి సరైన ప్రణాళిక వేయాలన్నారు. ఎర్ర చెరువు,పటేల్ చెరువు రిజర్వాయర్ గా మార్చి గ్రావిటీ ద్వారా గ్రావిటీ ద్వారా నీటి సరాఫరా పై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలన్నారు. రైతులకు మేలు జరగడం కోసం యాసంగి ఇచ్చే నీరు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో విడుదల చేస్తాం దానికి బదులు జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేయాలని అన్నారు.
వేములవాడ పట్టణంలోని మూలవాగు గుడి చెరువు లో మురికి నీరు చేరడానికి మురికి నీరు దారి మళ్లించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.. అలాగే ప్రతి వర్షాకాలం వేములవాడ పట్టణంలో బేడ బుడగ జంగాల కాలనీకి వరద నీరు వస్తుందని అలా రాకుండా అధికారులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు.
చందుర్తి-మోత్కరావుపేట్ ,మరిమడ్ల-మానాల రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు.
వేములవాడ పట్టణంలో బాలికల జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రపోజల్స్ పంపాలని చెప్పారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తూ జిల్లాను అన్ని విధాలుగా అభివృధి చేసేందుకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అదనపు కలెక్టర్లు ఎన్ ఖీమ్యా నాయక్, పూజారి గౌతమి, ఆర్డీఓ లు ఆనంద్ కుమార్, మధు సూదన్, ప్రత్యేక ఉప కలెక్టర్ బి గంగయ్య, zp సీఈఓ గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు