బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి, సౌకర్యాలు కల్పించాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారికి వినతి పత్రం అందజేత
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజున జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీనివాస్ గారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వని కళాశాలపై చర్యలు తీసుకొని, పరీక్షలు పకడ్బందీగా నిర్వహించి అన్ని సౌకర్యాలు కల్పించాలని వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ వార్షిక పరీక్షలు ప్రారంభమైతున్న సందర్భంలో విద్యార్థులు ఫీజులు కట్టలేదని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని మరోవైపు స్కాలర్షిప్లు పూర్తిస్థాయిలో రాలేదని డబ్బులు చెల్లించాలని, డబ్బులు ఇస్తేనే హాల్ టికెట్స్ ఇస్తామని అంటున్నారు తద్వారా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఫీజులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ వెంటనే హాల్ టికెట్స్ ఇచ్చేలా చేయాలని అన్నారు. అదేవిధంగా పరీక్షా సెంటర్లకు సౌకర్యాలు పూర్తిస్థాయిలో కల్పించి ,పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అన్ని గ్రామాల నుంచి పరీక్షలు రాస్తున్న కళాశాలలకు ప్రత్యేకమైన బస్ సౌకర్యం కల్పించాలని సెంటర్ ఆవరణంలో విద్యార్థులు కావలసిన సౌకర్యాలు కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకులు రాబిన్సన్,తనుగుల రాకేష్,ఆదిత్య,చరణ్,అక్షయ్,అజయ్, నరసింహ,ప్రసాద్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.