బలగం టీవీ, గంభీరావుపేట :
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని బిజెపి సీనియర్ నాయకులు గంభీరావుపేట ఇంచార్జ్ రామచంద్రారెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ అధిష్టానం గంభీరావుపేట మండల ఇన్ చార్జిగా రామచంద్రారెడ్డి నీ నియమించగా, బుధవారం మండల కేంద్రంలోని పార్టీ ఆఫీసులో బూత్ అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. కేంద్ర భుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామ చంద్ర రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడబోవుతుందని అన్నారు.
బీజేపీపై ప్రజల్లో విశేషమైన ఆదరణ ఉన్నదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ గెలుస్తుందన్నారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు , కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు . కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా బూత్‌స్థాయిలో ప్రచారం చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ప్రగతిని ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు అశోక్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణ, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ వాజిద్ హుస్సేన్, నాయకులు పత్తి స్వామి, కోడి రమేష్, విగ్నేష్ గౌడ్, పరశురాం గౌడ్,నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.