బలగం టీవీ, వేములవాడ:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పలు మండలాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు.
వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, చందుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు.
ఈ పరిశీలనలో తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్ రావు, అబూ బాకర్, భూపతి, ఎంపీడీఓలు శ్రీనివాస్, కీర్తన తదితరులు పాల్గొన్నారు.

