బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
ఈ నెల 25 వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు.
సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయిశ్రీ జూనియర్ కళాశాల అలాగే తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని టీజీఎస్ డబ్య్లూఆర్జేసీ కళాశాలలో చేసిన ఏర్పాట్లను మంగళవారం పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలకు చెందిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 4046, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4060 పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్షలు ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల (మార్చి 16వ తేదీ) దాకా నిర్వహించనున్నారని, ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 12 గంటల వరకు చేపట్టనున్నారని తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు వివిధ శాఖల అధికారులతో బృందాలు ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ పరిశీలనలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శరత్ కుమార్, తంగళ్ళపల్లి మండలం తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
