పోలింగ్ కేంద్రాల్లో వసతులు పరిశీలించిన అదనపు కలెక్టర్..

0
63

కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులో తనిఖీ

బలగం టీవీ, రుద్రంగి/చందుర్తి/ వేములావాడ రూరల్, డిసెంబర్ – 06:

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ లో ఎన్నికలు నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన వసతులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శనివారం పరిశీలించారు. రుద్రంగి లోని హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వసతులు పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేసి, భూ భారతి, సాదా బైనామా దరఖాస్తుల పై ఆరా తీశారు. పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రుద్రంగి ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ ను అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అక్కడి నుంచి నేరుగా చందుర్తి మండలం మల్యాలలోని హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో వసతులు పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుండగా, నాణ్యత, మెనూను తనిఖీ చేశారు.

వెంట వెంటనే అన్లోడ్ చేయాలి..

వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని మహాలక్షీ రైస్ మిల్లులో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకు వచ్చిన లారీలు, ధాన్యం నిల్వలు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే లారీలను ఎప్పటికప్పుడు దించుకోవాలని, ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలనలో రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్, చందుర్తి ఎంపీఓ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here