ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన అదనపు కలెక్టర్..

0
62

మూడో ఫేజ్ నామినేషన్ కేంద్రాల పరిశీలన

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీ ఏసీఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిలువలు చూసి, అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. రైతుల వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ వేగంగా పూర్తి చేసి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.

నామినేషన్ల పరిశీలన

ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ లో భాగంగా ఎల్లారెడ్డిపేట, హరిదాస్ నగర్, వెంకటాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ పరిశీలనలో వేములవాడ, ఎల్లారెడ్డిపేట తహసీల్దార్లు విజయ ప్రకాశ్ రావు, సుజాత తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here