కొనుగోలు కేంద్రాల్లో అదనపు కలెక్టర్ పరిశీలన..

0
38

బలగం టీవీ, బోయినిపల్లి:

వేములవాడ అర్బన్ మండలం అనుపురం, బోయినిపల్లి మండలం మానువాడలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 గా నిర్ణయించిందని తెలిపారు. రైతులు తమ సమీపంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి తహసీల్దార్ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here