బలగం టివి,సిరిసిల్ల:
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్(రెవెన్యూ) ఎన్. ఖీమ్యా నాయక్ మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్దేశించిన ధరల పట్టికను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేసి, వాటిపై అవగాహన కల్పించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయా పార్టీల ప్రతినిధులకు అదనపు కలెక్టర్ సూచించారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.