బలగం టీవీ, తంగళ్ళపల్లి:
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహిస్తున్న పలు పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదివారం సందర్శించారు. తంగళ్ళపల్లి మండలంలోని తంగళ్ళపల్లి, సారంపల్లి, మండేపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.
ఆయా పోలింగ్ కేంద్రాల్లో సీపీఓ శ్రీనివాసాచారి, తహసీల్దార్ జయంత్. ఎంపీడీఓ లక్ష్మీనారాయణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

