బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
యువకుడి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కై గతంలో ఆరు లక్షల ఎల్వోసి, నేడు రెండు లక్షల ఎల్వోసి మంజూరు చేపించిన ప్రభుత్వ విప్.

వేములవాడ పట్టణం భగవంతురావునగర్ చెందిన పండుగ సంతోష్ అనే యువకుడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సంబంధిత సమస్యపై వైద్యులను సంప్రదించగా కిడ్నీ మార్పిడి చేయవలసిందిగా వైద్యులు తెలుపగా బాధిత కుటుంబసభ్యులు అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశిస్తూ మరియు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా గత నెలలో వైద్య ఖర్చులకు 6 లక్షల రూపాయలను, శుక్రవారం అదనంగా మరో 2 లక్షల రూపాయల ఎల్వోసిని మంజూరు చేపించారు.