- బీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ..
బలగం టివి, రుద్రంగి:
ఎస్సి,ఎస్టీ,బీసీ వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ ద్వారానే సాధ్యం అని రుద్రంగి మండల బీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కుల గణన బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.. వారు మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి కులం అనేది కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.జనాభా దమాషాలో రిజర్వేషన్లు పెంచడానికి వెనుకబడిన తరగతుల సమకాలిన అంశాల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.. రాష్ట్ర ప్రజలందరి స్థితిగతులపై ఇంటింటి సర్వే నిర్వహించడం వల్ల అన్ని వర్గాల వారికి సమన్యాయం కలుగుతుందన్నారు..రాష్ట్ర బడ్జెట్లో కుల గణన కోసం 150 కోట్లు కేటాయించారని అన్నారు.కుల గణన సర్వే ద్వారా బీసీలు రాజకీయంగా సామాజికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చేలకల తిరుపతి, రుద్రంగి మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్,మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి,నాయకులు తర్రె లింగం, ధర్నా మల్లేశం,పల్లి గంగాధర్,గండి అశోక్,దయ్యాల సునీల్,పడాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు