యువకుడిపై దా*డి కేసులో హ*త్యా*ప్ర*యత్నం చేసిన వ్యక్తులు అరెస్ట్ రిమాండ్..

0
106

ఎస్సీ/ఎస్టీ చట్టం కింద ముగ్గురు అరెస్ట్

  • వివరాలు వెల్లడించిన డిఎస్పీ నాగేంద్రచారి.

బలగం టీవీ, సిరిసిల్ల:

సిరిసిల్ల పట్టణంలో యువకుడిపై దా*డి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 27, 2026 అర్ధరాత్రి సమయంలో బి.వై నగర్‌లోని జెండా గద్దె సమీపంలో మూల అభిలాష్, మొహమ్మద్ అబ్దుల్ ఆదీప్, కారంపూరి నికిత్ మరియు మరికొంత మంది కలిసి ఆకునూరి కళ్యాణ్ (26), అంబేద్కర్ నగర్, సిరిసిల్ల నివాసి తో గొడవకు దిగారు. ఈ సందర్భంగా వారు కళ్యాణ్‌ను కులం పేరుతో దూషిస్తూ చేతులతో కొట్టడం, కాళ్లతో తన్నడం మాత్రమే కాకుండా బండరాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై బాధితుడి తల్లి ఆకునూరి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యాయత్నం (Attempt to Murder) మరియు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్ విధించబడిందని తెలియజేశారు.

నిందితులు A1 మూల అభిలాష్ (19), స్వగ్రామం వేల్గిపూర్, ఇల్లంతకుంట మండలం, ప్రస్తుతం గీతానగర్, సిరిసిల్ల.., A2 మొహమ్మద్ అబ్దుల్ ఆదీప్ (19), గీతానగర్, సిరిసిల్ల.., A3 కారంపూరి నికిత్ (19), మార్కండేయ వీధి, సిరిసిల్ల.., మరియు మరికొంత మంది నిందితులు ఉన్నారని తెలిపారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు రెండు మోటార్ సైకిళ్లు, ఐదు మొబైల్ ఫోన్లు, దాడికి ఉపయోగించిన రాళ్లు అని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని హెచ్చరించారు.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here