బలగం టివి, సిరిసిల్ల
-వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి..
- వడ్డెర జిల్లా సంఘం అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్
రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి,1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలనీ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు పల్లపు లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్లపు లక్ష్మణ్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న, ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా రు తప్ప వడ్డెర్ల బతుకులో ఎలాంటి మార్పు రావడం లేదు అని అన్నారు.
వడ్డెర్ల బతుకులు మారి వారి జీవితాల్లో మార్పు రావాలంటే వడ్డెర కులాన్ని బీసీ నుండి తొలగించి ఎస్టిలో జాబితాలో చేర్పించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపాలని,చదువుకునే వడ్డెర విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలనీ అన్నారు.వడ్డెర కార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా,వడ్డెర కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పనుల్లో 20 శాతం ఈ ఎండి లేకుండా పనులు కేటాయించి బండ క్వారీలపై వడ్డెర్లకు పూర్తి హక్కు కల్పించాలనీ, జనాభా ప్రాతిపాదికన రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దండ్ల వంశీకృష్ణ, ఉపాధ్యక్షులు యాపకాయల సంతోష్, జిల్లా కార్యదర్శి శివరాత్రి అయిలయ్య లీగల్ అడ్వైజర్ బోధస్ రమేష్, జిల్లా కోశాధికారి సూర్య ప్రశాంత్, వేములవాడ నియోజకవర్గ అధ్యక్షులు పల్లపిశాక్ ,మండల అధ్యక్షులు కొడదల కొమురయ్య,అంజి, బత్తుల లక్ష్మణ్,ఆలకుంట దుర్గయ్య ,శివరాత్రి కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.