బలగం టివి, ఎల్లారెడ్డిపేట

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో వ్యవసాయ విజ్ఞాన యాత్ర చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిజాంబాద్ జిల్లాలోని అంకాపూర్ బయలుదేరి వెళ్లడం జరిగింది.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించడం,
పంట మార్పిడి వ్యవసాయ విధానం,
తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించడం,
సాధించిన దిగుబడిని మార్కెటింగ్ చేయడం ఇలాంటి అంశాలను అధ్యయనం చేయడం గూర్చి ఈబృందం అధ్యయనం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో జంగటి సత్తయ్య, ల్యాగల సతీష్, నేవురీ వెంకట నరసింహారెడ్డి, కనకట్ల సుధాకర్, గండ్ర ప్రభాకర్ రావు, గోగురి ప్రభాకర్ రెడ్డి, సంఘ సెక్రటరీ కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది కలసి వెళ్లారు.