సిరిసిల్ల ఎస్పీ గా అఖిల్‌‌ మహాజన్‌‌ పాస్..

0
130

సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్‌‌ వన్‌‌ ఇయర్‌‌ రిజల్ట్‌‌

సిరిసిల్ల ఎస్పీ గా పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

రాజన్నసిరిసిల్ల జిల్లా శాంతిభద్రతలపై తనదైన ముద్ర

సిరిసిల్ల పోలీస్‌‌ శాఖలో 90 శాతం తగ్గిన కరెప్షన్..

ఎస్‌‌హెచ్‌‌వోలు రూపాయి ముడితే ఇంటికే..

ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ అంటేనే ఎస్‌‌హెచ్‌‌వోలకు జంకు

సిరిసిల్ల జిల్లా పోలీస్‌‌ శాఖలో పెరిగిన పారదర్శకత

సిరిసిల్ల జిల్లాలో పోస్టింగ్‌‌ చేయడానికి ఎస్సైల వెనకడుగు

బలగం టివి,రాజన్నసిరిసిల్ల:

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీగా అఖిల్‌‌ మహాజన్‌‌ పదవి బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తి చేసుకున్నారు. 2017 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్‌‌ అఖిల్‌‌ మహాజన్‌‌ 2023 జనవరి 26న రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ గా పదవి బాద్యతలు స్వీకరించారు. అంతకు ముందు సిరిసిల్ల జిల్లా పోలీస్‌‌ ఇసుక దందాల్లో.. మాముళ్ల మత్తులో మునిగిపోయిన కొంత మంది పోలీసులతో సిరిసిల్ల పోలీస్‌‌ శాఖకు చెడ్డ పేరు వచ్చింది. సిరిసిల్ల ఎస్పీగా అఖిల్ మహాజన్‌‌ పదవి బాధ్యతలు స్వీకరించగా ఇసుక దందా, గుట్కా, గంజాయి నిరోధంతో పాటు.. శాంతిభత్రతల పరిరక్షణలో తనదైన శైలిలో విధులు నిర్వహించాడు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ… అవితీని దూరంగా.. ఉండేలా.. ఫిర్యాదుదారులపట్ల పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. సిరిసిల్ల పోలీసు శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. ఆర్టీసీ బస్సుల్లో సీసీ కెమెరాలు.. బాలికల ఆత్మరక్షణ కోసం కరాటే శిక్షణ, షీ టీమ్స్‌‌ బలోపేతం, ట్రాఫీక్‌‌ అవగహనపై కళాజాతాలు, బారీ ర్యాలీలు, బలగం నటి నటులతో మంచి కార్యక్రమాలు నిర్వహించి.. ఎమ్మెల్యే ఎన్నికల్లో సైతం ఎలాంటి అవంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించారు.

కేటీఆర్‌‌ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల లో ఏ చిన్న సంఘటన జరిగిన రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో సిరిసిల్ల జిల్లా పోలీసు శాఖ పనితీరు భేష్‌‌ అనే విధంగా ముందుకెళ్లారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్‌‌ సక్సెస్‌‌ అవుతారా లేదా అని అందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేసి.. లా అండ్‌‌ అర్డర్‌‌ లో తన సత్తా చాటారు. తాను సిరిసిల్ల లో నిర్వహించిన కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి.. నిధులు కేటాయించే పరిస్థితి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా పోలీసులు ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ అంటేనే జంకిపోతున్నారు. ఏ చిన్న తప్పు చేసిన కఠిన చర్యలు తీసుకోవడం..ఛార్జీ మోమోలు ఇవ్వడం.. సస్సెండ్‌‌ చేయడం వంటి చర్యలకు పూనుకోవడంతో కింది స్థాయి పోలీసు అధికారులు కూడా కాస్తా జాగ్రత్తగా విధులు నిర్వహించే పరిస్థితి వచ్చింది. ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌ నిక్కచ్చిగా ఉండటం.. పోలీసు అధికారులపై నిఘా పెంచి.. ఏ తప్పు చేసిన సహించేది లేదు అని చెప్పడంతో పోలీసు అధికారులకు కూడా కాస్తా వ్యతిరేఖం అయ్యారు. ఏడాది కాలంలో రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎలాంటి అవంచనీయ సంఘనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. నచ్చని పోలీసు అధికారులను, పలు అవినీతి అరోపణలు ఎదుర్కోన్న వారిని జిల్లా దాటించి.. తనకు నచ్చిన అధికారులను జిల్లాకు రప్పించుకోని పోలీస్‌‌ శాఖపై గౌరవం పెరిగేలా చేశారు. ధనవంతుడు వచ్చిన..పేదవాడు వచ్చిన ఫిర్యాదు దారుకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తరచు ఆదేశిస్తారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సిరిసిల్ల కలెక్టరేట్‌‌ ముందు ఏకంగా డమ్మీ కారును.. పోలీసు కటౌట్ ను ఏర్పాటు చేశారు. డ్రంక్‌‌ డ్రైవ్‌‌ టెస్టులు పెంచి పలువురికి సాధారణ జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకోని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు. సిరిసిల్ల ఎస్పీగా అఖిల్ మహాజన్‌‌ రావడంతో జిల్లా లోని పోలీసు అధికారులు ఉరుకులు , పరుగులుగా విధులు నిర్వహిస్తున్నారు. మంచిగా విధులు నిర్వహించే పోలీసు అధికారును ప్రశంశించడం.. తప్పులు చేసే వారిపై చర్యలు తీసుకోవడం.. పోలీసు శాఖ లో అవినీతిని దాదాపు రూపుమపారు. జిల్లాలో ఒకరిద్దరు పోలీసు అధికారులు అటు ఇటు ఉన్న.. గతంలో మాదిరిగా సిరిసిల్ల జిల్లా పోలీస్‌‌ లో అక్రమ మార్గాలు.. దందాలు లేవనే చెప్పాలి. బీఆర్ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ ఇలాకాలో ఏడాది పాటు ఎలాంటి విమర్శలు లేకుండా.. శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్‌‌ మహాజన్‌‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here