తలసాని నివాసానికి అఖిలేష్ యాదవ్..

0
60

బలగం టీవీ, హైదరాబాద్‍:

సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన అఖిలేష్ యాదవ్ ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసానికి ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అఖిలేష్ యాదవ్ జూబ్లీహిల్స్ లోని తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి చేరుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు అఖిలేష్ యాదవ్ కు స్వాగతం పలికారు. తన సోదరులు, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అఖిలేష్ యాదవ్ కు పరిచయం చేశారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీష్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ వెంట ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here