రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులకు అలర్ట్..

0
424

మూడు రోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్..

నీటి శుద్ధి కేంద్రంలో మరమ్మతులు.. జిల్లాలో తాగునీటి సరఫరాకు అంతరాయం..

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 120 ఎం.ఎల్.డి (MLD) సామర్థ్యం గల నీటి శుద్ధి కేంద్రంలో ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ కార్యనిర్వాహక ఇంజనీర్ మొహమ్మద్ ముజాహిద్ అన్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ మరమ్మతుల కారణంగా ఈనెల 20వ తేదీ (శుక్రవారం) నుంచి 22వ తేదీ (ఆదివారం) వరకు మూడు రోజుల పాటు ప్లాంట్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల సిరిసిల్ల, వేములవాడ మరియు చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. తిరిగి 23వ తేదీ (సోమవారం) నుండి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని ఆయన వెల్లడించారు. అప్పటివరకు ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here