బలగం టివి,సిరిసిల్ల:
కార్మిక చట్టాల రక్షణ హక్కుల పరిరక్షణ కోసం ఫిబ్రవరి 16న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న అన్ని విభాగాల కార్మికులు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు బీడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు సూరం పద్మ పిలుపునిచ్చారు.సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాలేజీ గ్రౌండ్ నుండి అర్డివో అఫీస్ వరకు ర్యాలీ చేపట్టడం జరుగుతుందని, బీడీ కార్మికులందరూ పాల్గొనాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు బేజుగం సురేష్ తదితరులు పాల్గొన్నారు.