బలగం టీవి , బోయినిపల్లి;
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం. కరీంనగర్ నగరంలోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో సామాజిక సేవకుడు న్యాయవాది, బోయినిపల్లి మండల జర్నలిస్టు అతికం రాజశేఖర్ గౌడ్ కు ఘన సన్మానం నిర్వహించి,మెమెంటోను అందజేశారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ: గత పదిహేళ్లుగా ఆత్మీయ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఎంతోమంది కి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు గాను సామాజిక సేవా విభాగంలో ఉత్తమ అవార్డును పూర్వ విద్యార్థుల అసోసియేషన్ అందజేశారు.మెమొంటోను న్యాయ కళాశాల ప్రొఫెసర్ల చేతులు మీదుగా అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, జూనియర్ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు