- అంబేద్కర్ సంఘం నాయకులు.
బలగం టీవీ : ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో సమావేశంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు మంజురు చేశారు కాని భవనం పూర్త కాలేదని పేర్కొన్నారు.ఈ భవనము పూర్తి కావడానికి ఇంకా లక్షల వరకు అవసరం ఉందన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మంజురు చేయాలని వెల్లడించారు.ఈ భవనం పూర్తి అయితే మండలములోనీ మాల మాదిగల శుభకార్యాలకు, సమావేశాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు అలాగే అంబేడ్కర్.స్టడీసర్కిల్ ఏర్పాటు చేయాలని కోరారు.వెంటనే అంబేద్కర్ భవనానికి కావలసిన నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్,మల్లేష్,రామచంద్రం అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.