అంబేడ్కర్ వర్ధంతి ప్రసంగం..

0
72
  • దామెర నర్సయ్య, రిటైర్డ్‌‌ డీఎస్పీ, సిరిసిల్ల

బలగం టీవీ, సిరిసిల్ల:

బాబసాహెబ్ డా. బి ఆర్ అంబేడ్కర్ గారు పరినిర్వాణం చెంది ఈరోజుకు 69 సంవత్సరాలు. ఐనా ఇంకా ఆయన వర్ధంతిని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము అంటే ఆ మహానుభావుడు జీవించి ఉన్నట్టే కదా!

జీవించడానికి బ్రతకడానికి చాల వ్యత్యాసం ఉన్నది. బ్రతకడం అంటే శ్వాస ఆడాలి, పల్స్ తెలియాలి, గుండె కొట్టుకోవాలి. కానీ జీవించడానికి శరీరం కూడా అవసరం లేదు. ప్రాణంతో ఉండనవసరం లేదు. తనకోసం బ్రతికితే తాను చనిపోయే వరకే కాని ప్రజల కోసం బ్రతికితే ప్రజలున్నంతవరకు జీవిస్తారు. అంబేడ్కర్ గారు ప్రజల కొరకు బ్రతికాడు కాబట్టి పరినిర్వాణం చెంది 69 సంవత్సరాలు అయినా ఇంకా ప్రజలలో జీవిస్తున్నారు. జీవించడమే కాదు ప్రతి పంచాయతీకి పరిష్కారం చూపుతున్నారు. ఆయన రాసిన రాజ్యాంగం లేకుంటే ఈరోజు తెలంగాణ లేదు. చిన్న రాష్ట్రాల ఆవశ్యకత గురించి బారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచారు కాబట్టి ఈరోజు తెలంగాణ సాద్యమైంది. ఆయన భారత దేశ పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌబాతృత్వం కావాలని అది సాదించడానికి తన జీవితాన్ని త్యాగం చేసాడు. తన జీవితాన్నే కాదు, తన పిల్లల భవిష్యత్తును, తన అర్దాంగి మాతృత్వాన్ని చివరకు ఆమె ప్రాణాన్ని కూడ త్యాగం చేసారు.

ఒకతను బాబసాహెబ్ గారిని ఏకవచనంతో అంటాడు అంబేడ్కర్ తన స్వంత వర్గం కొరకే పనిచేశాడు అని. ఆయన నిజంగా ఒక వర్గం కొరకే పని చేస్తే అతనికి నా అనే స్వార్థం ఉంటే స్వంత పిల్లలను ఎందుకు చంపుకుంటాడు? తన భార్య అనారోగ్యంతో చనిపోయినా తన ఉద్యమాన్ని ఎందుకు కొనసాగించాడు? ఆయన త్యాగం వెల కట్టలేనిది. ఆయనను విమర్శించే వాళ్ళందరికీ ఆయన రాసిన రాజ్యాంగ రక్షణ మాత్రం కావాలి.

బాబసాహెబ్ అంబేడ్కర్ గారు ఒక పెద్ద విప్లవకారుడు అంటే నమ్ముతారా?. విప్లవకారుడంటే యువతను అమాయకులను రెచ్చగొట్టి అడవులకు పంపి వందల వేల ప్రాణాలు బలి కోరాలి. మార్క్సిజం లెనినిజం మాత్రమే విప్లవమా? వారి విదానాలు ఎంతో మంది అమాయకులను అడవి బాటపట్టించాయి. భారతరత్న డా భీంరావు అంబేడ్కర్ గారు ఒక్కచుక్క రక్తం కార్చకుండ, ఏ ఒక్కరి ప్రాణాలు బలికోరకుండా ఎన్నో విస్పోటనలు సృష్టించారు .

భారత దేశ పౌరులందరికీ కులమత బేదం లేకుండా ఆడమగ వివక్ష లేకుండ దనిక పేద అనే భావం రాకుండా విద్యావంతుడా నిరక్షరాస్యుడా అనే తారతమ్యం లేకుండా పట్టణవాసా పల్లెజీవా అనే తేడా లేకుండా సమానమైన ఓటుహక్కు కల్పించడమే కాకుండా ధళిత గిరిజనులను చట్ట సభల్లోకి పంపించాడు. ఇది కాదా విప్లవం? విదవలు పదిమందిలో తిరగవద్దని, తిరిగితే అనర్హమనే భావజాలాన్ని మట్టి కరిపించి విదవరాలైన శ్రీమతి ఇందిరాగాంధీని దేశ ప్రదాని అయే అవకాశం కల్పించారు. ఇది కాదా విప్లవం? కొన్ని వర్గాలు అంటానివారని వారు ఊళ్ళల్లోకి రావద్దన్న ఆంక్షలను పటాపంచలు చేసి దళితుడైన రాంనాద్ కోవింద్ గారిని, అడవిబిడ్డ శ్రీమతి ద్రౌపది ముర్ముగారిని ఈ దేశ అద్యక్ష పీఠమెక్కే అవకాశం కల్పించారు. ఇది కాదా విప్లవం?

నిచ్చెనమెట్ల వ్యవస్థలో విశ్వకర్మలు లోహపు పనులు కర్రపనులు మాత్రమే చేయాలి, రజకులు మురికి పనులు మాత్రమే చేయాలి, కుమ్మరులు కుండలు చేసుకుని బతకాలి, నాయిబ్రాహ్మలు క్షౌరపు పనులు మాత్రమే చెయ్యాలి, పద్మశాలీలు బట్టలు నేయాలి, యాదవులు పశు సంరక్షణ చేయాలి, మాదిగలు చెప్పులు కుట్టాలి, మాలలు శవదహనాలు చేయాలనే నిబంధనలను తోసిరాజని, ఈ వర్గాల వారికి IAS IPSలు అయే అవకాశం, చట్టసభలకు వెళ్ళే అవకాశం మంత్రులు ముఖ్యమంత్రులు ప్రదాన మంత్రులు అయ్యే అవకాశం కల్పించే రాజ్యాంగ రచన చేసారు. ఇది కాదా విప్లవం?

ఇలా చెప్పుకుంటూ పోతే మనం పొందుతున్న హక్కుల సాదన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసారు. ఆయన కన్న కలలు స్వేచ్ఛ సమానత్వం సౌబాతృత్వం ఎవరి కొరకు? అనచివేతకు గురైన వర్గాల కొరకు కాదా? అనచివేత వర్గాలంటే SC ST BC మైనారిటీ వర్గాలే కాదు , ఈదేశ జనాభాలో సగమున్న స్త్రీజాతి కూడ అనచివేయబడ్డ వర్గమే.

అంబేడ్కర్ గారు లేకుంటే SC ST BC మైనారిటీ వర్గాల స్త్రీలే కాదు, బ్రాహ్మన క్షత్రియ వైశ్య స్త్రీలుకూడ వంటింటికే పరిమితమయేవారు. పురుషులతో సమానంగా స్త్రీలకు ఓటుహక్కు ఆస్తి హక్కులు సాధించారు? ఇది కాదా విప్లవం? పహెల్గాం దాడికి జవాబుగా మొన్న మనం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కు ఇద్దరు మహిళలు నాయకత్వం వహించారు. ఇండియన్ ఆర్మీకి సోఫియా కురేషి నాయకత్వం వహిస్తే ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కు వ్యోమాసింగ్ నాయకత్వం వహించారు. ఇదే ఆయన కలలు కన్న సమానత్వం. ప్రజలచేత ప్రజలనుండి ప్రజల కొరకు ప్రభువులను ఎన్నుకునే విధానం మనమంటున్న అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం తీసుక రావడం విప్లవం కాదా?

ఆయన గొప్ప విప్లవకారుడు అనడానికి నిదర్శనాలు ఇవి చాలవా?

ఆయనకు మనదేశంలోనే కాదు విదేశాలలో అభిమానులు ఉన్నారు అతన్ని అనుసరించే వారున్నారు. 2024లో మిస్ UAE గ సెలక్ట్ అయిన ఎమీలియా డొబ్రేవా తనకు భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ రోల్ మోడల్ అని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మహిళా హక్కుల కొరకు పోరాడిన ఏకైక నాయకుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక్కరే అని చెప్పింది.

ఆయన ఒక శీల శిఖరం, నిప్పు కణిక. అతను లండన్ లో గల గ్రేస్ ఇన్ అనే సంస్థలో సభ్యుడు. అందుకే ఆయనను బ్రిటిష్ వారు అరెస్టు చేయలేక పోయారు. ఆ సంస్థలో సభ్యుడు కావాలంటే అడ్వకేట్ అయి ఉండాలి, ప్రాపంచిక దేశాల రాజ్యాంగం తెలిసి ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here