- నాగుల సత్యనారాయణ గౌడ్, చైర్మన్ జిల్లా గ్రంధాలయ సంస్థ
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
శనివారం రోజున జిల్లా గ్రంథాలయ సంస్థ రాజన్న సిరిసిల్లలో భారతరత్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ భీం రావు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వం, హక్కులు అందించిన దేవుడని, ఈ దేశంలో ఉన్న అణగారిన ప్రజలందరి కోసం తన కడుపులో పుట్టిన బిడ్డలను పోగొట్టుకొని తన భార్యను కూడా పోగొట్టుకొని మన అందరి కొరకు తన కుటుంబాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగం అనే గొప్ప గ్రంథం ద్వారా స్వేచ్ఛ హక్కులు ప్రసాదించిన దేవుడు అంబేద్కర్ అని, అంబేద్కర్ కలలుగన్న సమాజాన్ని మనం అందించినప్పుడే అదే అంబేద్కర్ కు ఘనమైన నివాళి అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చొప్పదండి ప్రకాష్, ఆకునూరి బాలరాజు ఇన్చార్జి కార్యదర్శి B.శంకరయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు.

