అమృత్ 2.0 పనులు త్వరితగతిన పూర్తి చేయాలి..

0
61

-మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీదేవి.

-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష.

-హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్.

బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:

అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏ అండ్ యూడీ) సెక్రటరీ శ్రీదేవి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ లోకల్ బాడిల్లో అమృత్ 2.0 కింద చేపట్టిన పనుల పురోగతిపై హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్ష నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు. అమృత్ 2.0 కింద నీటి ట్యాంకుల నిర్మాణం, పైప్ లైన్ వేసే పనులను మొదలు పెట్టగా, అన్ని జిల్లాల వారీగా పనుల పురోగతిపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎంఏ & యూడీ సెక్రటరీ శ్రీదేవి మాట్లాడుతూ.. అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనులను వేగంగా పూర్తి చేసేందుకు కావలసిన సామగ్రి అందుబాటులో ఉండాలని, సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని సూచించారు. పనులపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో అమృత్ 2.0 కింద సిరిసిల్ల నియోజకవర్గంలో రూ. 100 కోట్ల నిధులతో నీటి ట్యాంకులు, పైప్ లైన్ పనులు మొదలు పెట్టారని, ఆయా పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని సూచించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో రూ.13 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై అభినందించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, పబ్లిక్ హెల్త్ డీఈ వరుణ్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here