బలగం టీవి,ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోగా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం పదిర గ్రామానికి చెందిన గూడ రాజిరెడ్డి (90) కొద్దిరోజులుగా అనారోగ్యం బాగు లేక కాలక్షేపానికి ఇంటి సమీపంలో ఉన్న కల్వర్టుపైన కూర్చొని కాలక్షేపం చేసేవాడు. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10 గంటలకు కల్వట్టు పైన కూర్చున్న వృద్ధుడు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు కల్వర్టుపై నుంచి బురదలోపడ్డాడు.గాయాలైన బుద్ధుడు మృతి చెందాడని అతడి కుమారుడు అంజిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ రమాకాంత్ అన్నారు.