బలగం టీవీ, తంగళ్ళపల్లి :
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ ఐదవ పాఠశాల సరైన వసతులు లేక ఆరుబయటే విద్యార్థులకు పాఠాలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడి కేంద్రంలో ఫ్యాన్ల కొరత,పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు లేకపోవడం, మరియు బాత్రూం నిర్మించారు అలా వదిలేయడంతో పిల్లలు ఆరు బయటే మలమూత్ర విసర్జనలు వెళ్లడం జరుగుతుంది. చదువుకోవడానికి 18 మంది విద్యార్థులు 20 మంది గర్భవతులు బాలింతలు ఉన్నారు. తాగడానికి నీరు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉందని కాంపౌండ్ వాల్ లేకపోవడంతో కుక్కలు, పాములు, పందులు వంటివి నిత్యం వస్తున్నాయని ఈ యొక్క పాఠశాల వలన పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం గా ఉందని ప్రతిదీ సమస్యగానే ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే ఐసిడిఎస్ అధికారులు స్పందించి సరైన మౌలిక సదుపాయలు కల్పించాలని కోరారు.
